మహానీయుల పోరాటాలు కొత్త తరానికి స్ఫూర్తి : ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
భారత్‌లో హైదరాబాద్ (Hyderabad) అంతర్భాగం కావడానికి ఎంతోమంది మహనీయుల బలిదానం కారణమని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ (Radhakrishnan) అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) ఆయన మాట్లాడారు. తొలుత పోలీసు అమరవీరుల స్మృతి స్తూపం వద్ద ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. అనంతరం జాతాయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన యోధులకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. మహనీయుల పోరాటాలు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Governor Shivpratap Shukla), కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








