ఆ భూములు ప్రభుత్వానికే ఇస్తా : కవిత
తనకు ఎంత భూమి ఉందనే వివరాలను ఎన్నికల అఫిడవిట్ (Election affidavit)లోనే వెల్లడించానని, అందులో చెప్పిన దాని కంటే గజం ఎక్కువున్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలిపారు. అసెంబ్లీలో 22ఏ పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలపై కవిత స్పందించారు. సీఎం అసెంబ్లీలో ఎవరెవరికి అక్రమ భూములు ఉన్నట్టు చెప్పారో, వారందరిపైన సరైన విచారణ జరిపిస్తారన్న నమ్మకం నాకు లేదు. సీఎం చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే, సీబీఐ విచారణ జరిపించాలి. నిబంధనలు అతిక్రమించి నాకు ఒక్క గజం భూమి అదనంగా ఉన్నటు తేలినా, ఆ భూములు సర్కారుకే ఇచ్చేస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నా అని పేర్కొన్నారు.








