రూ.లక్షల కోట్ల ఆస్తి కొందరి చేతుల్లోకి మారింది : సీఎం రేవంత్ రెడ్డి
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….
చరిత్ర కొంతమందిని ఎప్పుడూ క్షమించదు
గతంలో జరిగిన తప్పిదాలపై చర్చ జరిగితేనే… భవిష్యత్తులో పొరపాట్లు సరిదిద్దుకోవచ్చు
కానీ ప్రతిపక్షం గతంలో జరిగిన తప్పులను చర్చించకూడదని సభ నుంచి బయటికి వెళ్లారు
విద్యుత్ కొరత రావాలి అని కొందరు క్షుద్ర పూజలు చేశారు
ఇది కూడా సభలో చర్చకు వస్తుంది అని భయపడ్డారు
మా ప్రభుత్వానికి ప్రతీ ఆడబిడ్డ సమానమే
MLA లు అయినా… సామాన్య మహిళలు అయినా గౌరవంగా చూసుకుంటాం
కొంత మంది ప్రతిపక్ష నాయకులు వికృత చేష్టలతో వ్యవహరించారు
స్పీకర్ గా ఒకరిని ఆమోదం పొందిన తరవాత.. అందరికీ సమాన హక్కులు కాపాడే పని చేస్తారు
అలాంటి చైర్ ను కాపాడుకోవడానికి గత ప్రభుత్వం కమిటి వేసి రూల్స్ రాసుకున్నారు
శాసన సభ నిర్వహించడానికి ప్రొసీజర్ సిద్ధం చేసింది గత ప్రభుత్వమే
నినాదాలతో ఉన్న డ్రెస్ వేసుకుని రావద్దని సభ ఆమోదం చేసింది
హరీష్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ సభ లో ఆమోదం పొందింది
పోలీసు అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు… స్పీకర్ ఆదేశాలు అమలు చేస్తారు
ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కూడా నల్ల చొక్కా తో వచ్చారు కదా అంటున్నారు
ఇవి కూడా చదవండి
నినాదాలతో కూడిన టి షర్ట్ వేసుకొని రావద్దు అని స్పీకర్ ఆదేశిస్తే… అనుమతించరు
పార్లమెంట్ నిబంధనలు అక్కడ.. అసెంబ్లీ లో నిబంధనలు ఇక్కడ అమలు చేస్తారు
పోడియం లోపలికి వస్తె… సభ్యుడు సస్పెండ్ అయినట్టే అని చట్టం చేశారు
కానీ మీరు గౌరవంగా క్షమించారు.. సభలో మైక్ ఇచ్చారు
సభలో సభ్యులను..సభ బయట స్పీకర్ ను దూషించారు
సభలోకి వచ్చాకా… సరే మార్పు వచ్చి ఉంటుందేమో అని మైక్ ఇచ్చారు
అప్పుడు కూడా అలాగే చేశారు.. అందుకే మీరు సస్పెండ్ చేశారు
ధరణి అడ్డం పెట్టుకుని… భూదాన భూములను పట్టా చేసుకున్నారు
ఫారెస్ట్ భూముల నుండి 106 ఎకరాల భూమి గండ్ర కు అప్పగించారు
ఈ విషయంలో కలెక్టర్ ను సుప్రీంకోర్టు తిట్టింది
సిరిసిల్లలో 8 వేల అసైన్డ్ భూములు బదలాయించారు
సందీప్ ఝా ను కలెక్టర్ గా వేస్తే 2 వేల ఎకరాలు బయటకు తీశారు
మైహోమ్ రామేశ్వర రావుకు ఎయిర్పోర్ట్ కు అనుకుని 2647 ఎకరాల భూమి కట్టబెట్టారు
ప్రజల సొమ్ము ఇలా కొల్లగొడతారా?
కాప్రాలో.. అవేక్యు ప్రాపర్టీ అని రాయించారు నమస్తే తెలంగాణలో
తర్వాత ధరణి తెచ్చి మేల్లచెరువులో భూదాన్ భూములు లాక్కుంది
మైహోమ్ 113 ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీ కి వాడుకుంటున్నారు
అసైన్డ్ భూములు… వక్ఫ్ భూములు అన్ని మై హోమ్ వాళ్ళు లాక్కోవచ్చా?
భూములు ఎక్కడ కనిపించినా గద్దల లెక్క వాలిపోయారు..లక్ష కోట్ల భూములు లాక్కున్నారు
ఈ చర్చ రాకుండా ఉండాలనే సభలో గందరగోళం చేయాలని చూశారు
ఆడబిడ్డల అడ్డంపెట్టుకుని అడ్డుకోవాలి అనుకున్నారు
శిశుపాలునికి కూడా వంద తప్పులు చేస్తేనే శిక్ష పడింది
ఏ రాక్షసుడి కి అయినా సమయం వస్తుంది… అప్పుడే శిక్ష పడుతుంది
22 ఏ ను అడ్డంపెట్టుకుని మాపై నిందలు వేయాలని చూశారు
మేం అన్ని బయట పెడుతున్నాం…
సంగారెడ్డి లో భూముల చిట్టా కూడా బయట పెడతా
ఇలాంటి వాళ్లను మనం క్షమిస్తే.. మనల్ని భవిష్యత్ తరాలు క్షమించవు
వీటన్నింటిపై SET విచారణకు సిఫార్సు చేస్తున్నా
సామాన్య ప్రజల సమస్య పరిష్కారం చేసేలా కమిటీ ఏర్పాటు చేస్తున్నాం
ధరణి దోపిడి..లక్షల కోట్ల ఆస్తి కొందరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది
మా మంత్రి కొంచెం ముక్కుసూటి మనిషి… అందుకే ఆయన మీద కొంత కోపం పెంచుకున్నారు
రజాకర్ల సమయం తప్పిస్తే.. మిగిలిన నిజాం పాలన అద్భుత మైన పాలన
కాస్రా పహానిలో కబ్జా కాలంలో ఎక్కువ పేదలు ఉండే వాళ్ళు
ధరణిలో అసలు కబ్జా కాలమే తీసేశారు
ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాస్తూ..కాస్రా పహాని తిసేసారు
కేసీఆర్… వచ్చాక మండల స్థాయిలో ఉన్న రికార్డుల వ్యవస్థ.. కలెక్టర్ కి వచ్చింది
ధరణి పోర్టల్.. కంప్యూటరైజ్ చేయడమే.. కానీ అక్కడే కుట్ర చేశారు
భూదాన్ భూములు కూడా కబ్జా జరిగాయి.. వాటిని కూడా బయట పెడతా
భూముల కోసం పోరాటం చేసింది ఎర్రజెండా… భూములు పంచింది కాంగ్రెస్
సీలింగ్ యాక్ట్ చేసింది కాంగ్రెస్
పేదలు భూ హక్కులు
అనుభవిస్తున్నారంటే.. దానికి కారణం ఇందిరాగాంధీ
ఇందిరమ్మ మీద వాళ్లో .. వీళ్లో వెకిలి మాటలు మాట్లాడతారు
కానీ భూములు పంచిన ఘనత ఇందిరమ్మది
కాళేశ్వరంలో మంది ఎక్కువై మజ్జిగ పలచన అయ్యింది
మజ్జిగ రుచి దొరకు నచ్చలేదు.. అప్పుడే భూమిపై పడింది దొర కన్ను
అందుకు వాడిన అస్త్రం ధరణి
2010 లో ఒరిస్సాలో ధరణి ప్రారంభం అయింది
కానీ కేసీఆర్.. నేనే మెదడు రంగరించి ధరణి తెచ్చిన అన్నాడు
ఒరిస్సా లో తెచ్చిన ధరణి ను కాగ్ తిట్టిన తిట్టూ తిట్టకుండా తిట్టింది
ఆ సమయంలో కేసీఆర్ ధరణి తెచ్చి పెట్టాడు
నేను కేసీఆర్ ను పదే పదే సభకు రమ్మని ఎందుకు అడిగా అంటే..
ధరణి చిట్టా అంతా చెప్పాలని రమ్మన్నా
అందుకే బబుల్ షూటర్… కేసీఆర్ ను సభకు రావద్దని చెప్పాడు
ధరణి పోర్టల్ నిర్వహణకు ఐదేళ్లకు 58 కోట్లు… కానీ 1300 కోట్లకు ఎలా పెరిగింది
వీటిపై సమాధానం వాళ్ళు చెప్పుకోవాలి కదా..?
అసెంబ్లీ కి రావడానికి ఆయనకు గుండెలు లేవు
ల్యాండ్ రికార్డ్ అప్డేట్ చేయాలి అంటే… పార్ట్ అ, పార్ట్ బ్ గా చేశారు
పార్ట్ b అంతా నిషేధిత జాబితాలో పెట్టారు
నిషేధిత జాబితా ధరణి తోనే వచ్చింది
21 లక్షల 93 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారు
రైతులు తిరిగి తిరిగి అలిసి పోయారు..
దళారులు… దోపిడి దారులు దోచుకున్నారు
దళారులు…దోపిడి దారులు వేరు వేరు కాదు
ఇద్దరు ఒకరే… వాళ్లే BRS వాళ్లు
98 లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉండాల్సిందే
అటవీ, అసైన్డ్, దేవాలయ భూములు నిషేధిత జాబితాలో ఉండాల్సిందే
ఇందులో నుండి ఒక్క ఇంచ్ భూమి కూడా తీయొద్దు
ప్రైవేట్ వ్యక్తుల భూములు 3 లక్షల 77 వేల ఎకరాల మీదనే పంచాయతీ
అగ్గిపెట్టె రావు.. కోటి ఎకరాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
నిషేధిత జాబితాలో ఉన్న భూములు తొలగించండి అని కేసీఆర్ తో లేఖ రాయించు
మేం భూములు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాం
మీరు కొల్లగొట్టడానికి ఏం చేశారో కూడా చెప్తా
2025 లో రికార్డులు సెట్ చేసి…సమస్య పరిష్కారం కోసం భూ భారతి తెచ్చాం
22 ఏ మేం తెచ్చింది కాదు… ఉమ్మడి ఏపీలో తెచ్చిన చట్టం
1999 లో 22 ఏ తెచ్చారు
హైకోర్టు ఆదేశాలతో 2025 లో కలెక్టర్ ల నుండి జాబితా తెచ్చి నిషేధిత జాబితాలో పెట్టాం
ధరణి నుండి 7 లక్షల పై చిలుకు ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంది
2026 కి 3 లక్షల పై చిలుకు తగ్గింది
ఇకపై 22 అ లో చేర్చాలి అన్నా…కొన్ని విధానాలు పెట్టుకున్నాం
2 అంశాలు ప్రభుత్వం గుర్తించింది
పట్టణ భూ క్రమబద్ధీకరణపై త్వరలోనే పాలసీ తీసుకొస్తాం
భూముల రిజిస్ట్రేషన్..క్రమబద్ధీకరణ ఏకకాలం లో చేస్తాం
అధీకృత లే అవుట్లలో సంబంధిత అధారిటీతో విచారణ చేసి సమస్య పరిష్కారం
వారం లో కొత్త గైడ్ లైన్ ఇస్తాం
సింగరేణి ప్రాంతం లో సమస్యకు జిల్లా స్థాయి ఉన్నత స్థాయి కమిటి ఏర్పాటు చేస్తాం
వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం చేస్తాం
సింగరేణి యాజమాన్యం తో సంఘాల నాయకులు కూడా కూర్చొని పరిష్కారం చేసుకోండి
Go 118 పెండింగ్ దరఖాస్తులు నిర్ణిత సమయంలో పరిష్కారం చేస్తాం
ఎల్ బి నగర్ పరిసరాల్లో సమస్య ఎక్కువ…మీకు శుభవార్త వస్తుంది
వీలైనంత త్వరగా మీ సమస్య పరిష్కారం అవుతుంది
ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ లబ్ది దారుల కు ఐదేళ్లు లాకింగ్ పీరియడ్
తర్వాత అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తాం
రిజిస్ట్రేషన్ తో పాటు నాలా ఫీజు కడితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాం
అన్ని సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం
ఎవరికి ఏ సమస్య ఉన్నా.. అక్కడ పరిష్కారం చేస్తాం.








