సూపర్ స్టైలిష్ గా అదరగొడుతున్న ఐశ్వర్య
మోడలింగ్ తో కెరీర్ ను ప్రారంభించిన ఐశ్వర్య లక్ష్మి(Aishwarya lekshmi) తర్వాత యాక్టింగ్ లోకి అడుగుపెట్టి 2017లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సిని మాతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ సౌత్ అవార్డును అందుకున్న ఆమె ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటారు. తాజాగా ఐశ్వర్య మెజెంటా కలర్ డ్రెస్ లో చేతిని నుదుటి వద్ద పెట్టుకుని లాంగ్ డ్యాంగ్లింగ్ ఇయర్ రింగ్స్, సాఫ్ట్ మేకప్ తో ఎంతో కూల్ గా స్టైలిష్ గా కనిపించింది. ఈ ఫోటోలో ఐశ్వర్య మరింత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోకు తెగ లైకులు కొడుతున్నారు.








