ఈ నెల 18న కిరణ్ అబ్బవరం మూవీ “హతః” టీజర్ రిలీజ్
పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న సినిమా “హతః”. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో శివశంకర నాయుడు. వై నిర్మిస్తున్నారు. అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్నారు. “హతః” సినిమాలో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ అనౌన్స్ మెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ నెల 18న “హతః” సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ తో ఈ మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ పై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. “హతః” సినిమామాలో కొత్త తరహా కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు అనే ఇంప్రెషన్ మూవీ లవర్స్ లో ఏర్పడుతోంది.








