క్రెడిట్ కార్డ్ ‘Minimum Due’ ఒక పెద్ద ట్రాప్.. మిమ్మల్ని ముంచేసే 7 హిడెన్ ఛార్జీలు ఇవే!
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో Minimum Amount Due (MAD – కనిష్ట బకాయి మొత్తం) లో కేవలం మీరు వాడిన అసలు మొత్తమే కాకుండా, వివిధ రకాల అదనపు ఛార్జీలు (Other Charges) కూడా యాడ్ అవుతాయి. సాధారణంగా మీ మొత్తం బకాయి (Total Amount Due) లో 5% మొత్తాన్ని కనిష్ట బకాయిగా నిర్ణయిస్తారు. అయితే, కింద పేర్కొన్న ఛార్జీలు ఉన్నప్పుడు అవి నేరుగా MAD కి కలుస్తాయి.
వడ్డీ, లేట్ ఫీజు.. ఇవన్నీ Minimum Dueలో కలుస్తాయి

అయితే.. వడ్డీ చార్జీలు.. ఇది క్రెడిట్ కార్డ్ వాడకంలో పడే అతిపెద్ద ఛార్జ్. సాధారణంగా నెలకి 3% నుండి 4.2% వరకు (అంటే ఏడాదికి 36% నుండి 50% వరకు) వడ్డీ వసూలు చేస్తారు.మీరు గత నెలలో పూర్తి బిల్లు చెల్లించకపోతే, మిగిలిన బకాయిపై పడే వడ్డీ పూర్తిగా ఈ నెల MAD కి యాడ్ అవుతుంది.
అలాగే గత నెల బిల్లును గడువు తేదీ లోపల చెల్లించనందుకు విధించే జరిమానా పూర్తిగా ఇందులో కలుస్తుంది.Minimum Amount చెల్లిస్తే ఆలస్య రుసుము (Late Fee) పడదు కానీ, మిగిలిన బకాయి మొత్తానికి బిల్లు తేదీ నుండి రోజువారీ ప్రాతిపదికన (Daily basis) వడ్డీ లెక్కించబడుతుంది.గత నెలల్లో మీరు కనీస బకాయి కూడా చెల్లించకుంటే, ఆ పాత బాకీ మొత్తం ఈ నెల MAD కి అదనంగా కలుస్తుంది.
EMI, Overlimit, వార్షిక రుసుము.. ఇవి కూడా MADలో భాగమే

అయితే.. మన క్రెడిట్ కార్డ్ లిమిట్ కంటే ఎక్కువ డబ్బులు వాడితే, ఆ అదనపు మొత్తం (Overlimit Amount) వంద శాతం కనిష్ట బకాయికి యాడ్ అవుతుంది. మీరు కార్డ్‌పై ఏవైనా వస్తువులు కొని ఈఎంఐ పెట్టుకుంటే, ఆ నెలకు సంబంధించిన ఈఎంఐ మొత్తం (అసలు + వడ్డీ) నేరుగా MAD లో యాడ్ అవుతుంది. మీ కార్డ్‌కు సంబంధించిన వార్షిక రుసుము పడినప్పుడు అది కూడా ఇందులో భాగమవుతుంది. అన్ని రకాల సేవా ఛార్జీలు మరియు ఫీజులపై విధించే 18% GST కూడా కనిష్ట బకాయి మొత్తంలో కలిసి వస్తుంది.
ఇవి కూడా చదవండి
దీని తర్వాత ఓవర్ లిమిట్ ఫీ కూడా ఉంటుంది. వడ్డీ, చార్జీలు మరియు GST కలవడం వల్ల మీ క్రెడిట్ కార్డ్ బకాయి మీ టోటల్ క్రెడిట్ లిమిట్ కంటే ఎక్కువైతే, బ్యాంక్ Over-Limit Fee ని విధిస్తుంది (సాధారణంగా రూ. 500 లేదా లిమిట్ దాటిన మొత్తంలో 2.5%).
Minimum Due చెల్లించకపోతే Late Fee.. Cash Withdrawal చేస్తే అదనపు ఛార్జీలు

ఆలస్య రుసుము కూడా ఉంటుంది. గడువు తేదీలోపు Minimum Amount Due కూడా చెల్లించకపోతే ఈ చార్జ్ పడుతుంది. మీ మొత్తం బకాయి ఆధారంగా రూ. 100 నుండి రూ. 1,300 (లేదా అంతకంటే ఎక్కువ) వరకు లేట్ ఫీజు విధిస్తారు. బకాయి ఎక్కువగా ఉంటే ఈ రుసుము కూడా పెరుగుతుంది.
ఇక.. జీఎస్టీ కూడా ఉంటుంది. బ్యాంకులు వసూలు చేసే అన్ని రకాల చార్జీలు మరియు వడ్డీలపై GST వర్తిస్తుంది. అన్ని ఫైనాన్స్ చార్జీలు, లేట్ ఫీజులు మరియు ఇతర సేవా రుసుములపై 18% GST అదనంగా జోడించబడుతుంది. కార్డ్ ద్వారా ATM నుండి నగదు విత్‌డ్రా చేసి, దానికి Minimum Due మాత్రమే చెల్లిస్తే, నగదు విత్‌డ్రా చేసిన క్షణం నుంచే రోజువారీ వడ్డీ పడుతుంది. దీనితో పాటు Cash Advance Fee (సుమారు 2.5% నుండి 3% లేదా కనిష్టంగా రూ. 500) పడుతుంది.








