రేపు ‘వారణాసి–వాద్నగర్ సేవా యాత్ర’లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై కాశీలో ‘సేవా సంకల్ప్ అభియాన్’
అమరావతి, సెప్టెంబర్ 16: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ప్రజా జీవితంలో నరేంద్ర మోదీ చేసిన సేవలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కాశీ నగరంలో వారణాసి–వాద్నగర్ సేవా యాత్రను చేపట్టారు. ప్రధాని మోదీ ప్రజా జీవితంతో ప్రత్యేక అనుబంధం ఉన్న వారణాసి, వాద్నగర్ను అనుసంధానిస్తూ ఈ సేవా సంకల్ప్ అభియాన్ లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. యువత, ప్రజా ప్రతినిధులు, సేవా ప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ సంకల్ప్ అభియాన్ చేప్టటారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రజా భాగస్వామ్యం, సేవా భావం, సామాజిక బాధ్యత కీలకమనే సందేశాన్ని ‘సేవా సంకల్ప్ అభియాన్’ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ప్రతీ గ్రామం, ప్రతి కుటుంబం, ప్రతి యువత, ప్రతి మహిళ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వామి కావాలనే స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు.
సీఎం చంద్రబాబు వారణాసి పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 7.30 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9.35 గంటలకు వారణాసి చేరుకుంటారు. ముందుగా 11.15 గంటలకు వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథుడ్ని ముఖ్యమంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం రుద్రాక్ష్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని సేవా యాత్ర ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 3.10 గంటలకు వారణాసి నుంచి బయలుదేరి 5.15 గంటలకు తిరిగి అమరావతి చేరుకోనున్నారు.








