తిరుమలలో ఎస్వీ మ్యూజియంను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
• మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవోలతో కలిసి ఎస్వీ మ్యూజియంలో విశేషాలను పరిశీలించిన ముఖ్యమంత్రి
• శ్రీవారి మహత్యం, తిరుమల విశిష్టతలను తెలిపేలా మ్యూజియంలో వివిధ అంశాల ప్రదర్శన
• శ్రీకృష్ణదేవరాయలు సహా వివిధ సందర్భాల్లో శ్రీవారికి సమర్పించిన ఆభరణాల నమూనాలు, చారిత్రక అంశాలను తెలిపేలా మ్యూజియంలో వస్తు ప్రదర్శన
• శ్రీవారికి ధరింప చేసే వివిధ కిరీటాలు, ఆభరణాలను త్రీడీ మోడల్ లో చిత్రీకరించి వాటిని ప్రదర్శించేలా మ్యూజియంలో ఏర్పాటు
• మ్యూజియంలోని పానోరమిక్ స్క్రీన్ పై ఏఐ వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాల ప్రదర్శనను తిలకించిన ముఖ్యమంత్రి
• తిరుమల కొండపై వివిధ ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి ఏర్పాటు చేసిన భౌగోళిక విశిష్టతలను తెలిపేలా మ్యూజియంలో ప్రదర్శన ఏర్పాటు చేసిన టీటీడీ
• భక్తులకు అవగాహన వచ్చేలా తిరుమల ఏడు కొండల త్రీడీ మోడల్ ను కూడా మ్యూజియంలో ఏర్పాటు చేసిన టీటీడీ
• తిరుమలకు వచ్చి ఆయుధాలు త్యజించి ఆధ్యాత్మికతను అనుసరించిన వివిధ రాజ్యాల రాజుల ఆయుధాలను కూడా మ్యూజియంలో ప్రదర్శన
• అన్నమాచార్యులు సహా వివిధ భక్తులు శ్రీవారిని కీర్తించేందుకు వినియోగించిన సంగీత వాయిద్యాలను కూడా మ్యూజియంలో ఏర్పాటు.








