వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు చుక్కెదురు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు నిందితులకు చుక్కెదురైంది. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు(CBI Court) తిరస్కరించింది. ఏ1 గంగిరెడ్డి (Gangi Reddy), ఏ3 ఉమాశంకర్ రెడ్డి( Uma Shankar Reddy), ఏ6 ఉదయ్ (Uday) పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వాటికి విచారణార్హత లేదని కోర్టు పేర్కొంది.








