హైదరాబాద్ వీధుల్లో ‘మూషక ఆన్ వీల్స్’ సందడి.. బప్పాస్ డెలివరీ పార్ట్నర్గా ‘ఓన్లీ’ వినూత్న ప్రచారం
వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలో వినాయకుడికి ఇష్టమైన మూషకుడిని సరికొత్తగా పరిచయం చేస్తూ ర్యాపిడో ఫుడ్ డెలివరీ యాప్ ‘ఓన్లీ’ (Ownly) ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వామివారికి నమ్మకమైన సహచరుడైన మూషకుడిని ‘డెలివరీ పార్ట్నర్’ పాత్రలో మలుస్తూ “మూషక ఆన్ వీల్స్: బాప్పాస్ డెలివరీ పార్టనర్” పేరుతో ఈ ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఒక బ్రాండెడ్ వ్యాన్‌పై ఏర్పాటు చేసిన భారీ సైజు మూషక విగ్రహం నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మూషకుడిని కేవలం పందిళ్లు, శోభాయాత్రలకే పరిమితం చేయకుండా రద్దీ రోడ్లపైకి తీసుకొచ్చి ఈ ప్రచారం రూపొందించారు.
సంచార వాహన సమయాలు , రూట్ మ్యాప్..
ఈ సంచార వాహనం సెప్టెంబర్ 14 నుండి 25 వరకు నగరంలో తిరగనుంది. ప్రధాన గణేష్ పందిళ్లు, నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులు, రద్దీగా ఉండే ప్రాంతాలను ఇది కవర్ చేస్తుంది. బాలాపూర్, ఓల్డ్ సిటీ, నాగోల్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, మాదాపూర్ , కూకట్పల్లి ప్రాంతాల గుండా ఈ వాహనం వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ వ్యాన్ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రయాణిస్తుంది. సాయంత్రం వేళల్లో కుటుంబాలతో పందిళ్ల సందర్శనకు వచ్చేవారికి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్ వాసులు ఈ వాహనాన్ని చూసి, ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పంచుకునేలా ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు.
‘ఓన్లీ’ ప్రతినిధుల స్పందన , నేపథ్యం..
భారతీయ కుటుంబాలలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు వినాయకుని నామస్మరణ చేయడం ఆనవాయితీ అని, వినాయకుడు శుభారంభాలకు సంకేతంగా నిలుస్తూ కొత్త ప్రయాణాలకు సానుకూలత తెస్తాడని ‘ఓన్లీ’ ప్రతినిధులు తెలిపారు. పండుగ ఉత్సాహంలో భాగం కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. మూషకుడి సాంస్కృతిక అనుబంధాన్ని ‘ఓన్లీ’ ఉల్లాసభరితమైన ఆలోచనతో జోడించి ఈ పండుగ అనుభవాన్ని సృష్టిస్తున్నట్లు వెల్లడించారు.
యాప్ ద్వారా సేవలు , డిజిటల్ ప్రచారం..
ఈ ఆన్‌గ్రౌండ్ కార్యక్రమం హైదరాబాద్‌లో కేంద్రీకృతమైనప్పటికీ, హైదరాబాద్ , బెంగళూరులలోని యాప్ ద్వారా పండుగ అనుభవాన్ని ‘ఓన్లీ’ విస్తరించింది. పండుగ ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా ఇండియన్ స్వీట్స్ , ప్యూర్ వెజ్ ఐటమ్స్‌ను యాప్‌లో హైలైట్ చేస్తోంది. వాహనంతో పాటు ఖైరతాబాద్, బాలాపూర్, మాదాపూర్, మియాపూర్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి వంటి ఎంపిక చేసిన గణేష్ పందిళ్ల వద్ద ఓన్లీ తన బ్రాండింగ్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా సందర్శకులకు అగర్బత్తీలను పంపిణీ చేస్తూ స్థానిక స్థాయి గణేష్ ఉత్సవాల్లో భాగస్వామ్యమవుతోంది. గ్రౌండ్ విజిబిలిటీ, యాప్ కమ్యూనికేషన్ , డిజిటల్ ప్రచారాన్ని జోడించడం ద్వారా పండుగలోని ప్రతి క్షణంలో భాగం కావాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.








