కమ్యూనిస్టులు లేకండా భూపోరాటాలు ఎక్కడ జరగలేదు : కూనంనేని
కమ్యూనిస్టులు లేకుండా భూపోరాటాలు ఎక్కడ జరగలేదని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సంబశివ రావు (Koonamneni Sambasiva Rao) అన్నారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై శాసనసభలో నిర్వహించిన చర్చలో కూనంనేని మాట్లాడారు. 1945 నుంచే కమ్యూనిస్టులు (Communists) పోరాటం చేస్తున్నారని చెప్పారు. ధరణిలో జరిగిన తప్పిదాలతో ప్రజలకు చాలా నష్టం జరిగిందన్నారు. 3 లక్షల ఎకరాల ప్రైవేటు (Private) భూముల వివరాలను బయటకు తీయాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హైదరాబాద్ (Hyderabad) సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, భూదాన్ భూముల వివరాలను వెల్లడించాలన్నారు. భూదాన్ (Bhoodan) భూములపై ఫొరెన్సిక్ ఆడిట్ నిర్వహించే అంశాన్ని ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు. నిజాం హయాంలో సర్ఫ్ఖాన్ పేరిట హైదరాబాద్లో ఉన్న భూములు ఇప్పుడు ఎక్కడని ప్రశ్నించారు. వాటిని బయటకు తీస్తే స్థలం లేని అందరికీ ఇవ్వొచ్చన్నారు. 22ఏ విషయంలో జరిగింది సాంకేతిక తప్పిదంగా భావిస్తున్నట్లు తెలిపారు. దీనిలో మంత్రులు, అధికారుల పాత్ర ఎంత ఉందో తేల్చాలన్నారు.








