నవంబర్ 1న క్యాట్స్ ఆధ్వర్యంలో దసరా – దీపావళి సంబరాలు
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (Capitol Area Telugu Society – CATS) ఆధ్వర్యంలో ఈ సంవత్సరం దసరా , దీపావళి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంస్కృతి, సంగీతం, రుచికరమైన ఆహారం , ఉత్సాహభరితమైన వాతావరణంలో కుటుంబసమేతంగా ఈ పండుగ వేడుకలను ఆస్వాదించేందుకు తెలుగు ప్రజలను నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. నవంబర్ 1, 2026 న మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల (EST) వరకు ఈ వేడుకలు కొనసాగుతాయి. వర్జీనియా (VA) లోని ఆల్డీ/యాష్బర్న్ (Aldie/Ashburn) ప్రాంతంలో ఉన్న హైస్కూల్ వేదికగా ఈ వేడుకలు జరగనుండగా, పూర్తి వేదిక వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు , వెండర్ రిజిస్ట్రేషన్..
ఈ వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలను ఆసక్తి ఉన్నవారు https://tinyurl.com/CATS-Diwali26-Cultural లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే స్టాల్స్ లేదా వ్యాపార భాగస్వామ్యం కోసం నమోదు చేసుకోవాలనుకునే వారు https://tinyurl.com/CATS-Diwali26-Vendors లింక్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.








