ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. మంగళవారం 892 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా 2050 ఎస్సై(SI), కానిస్టేబుల్ పోస్టులకు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎస్ఎల్పీఆర్బీ ) (APSLPRB)ప్రకటన విడుదల చేసింది. ఎస్సై విభాగంలో సివిల్ 253, ఏఆర్ 116, ఎస్పీఎఫ్ 09, కమ్యూనికేషన్ 50, పీటీవో 10 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ (Constable) విభాగంలో 542 సివిల్, 285 ఏఆర్, 158 ఫైర్, జైలు వార్డర్ పురుషులు 150, జైలు వార్డర్ మహిళలు 21, కమ్యూనికేషన్ 200, పీటీవో విభాగంలో 15 మెకానిక్స్, 198 డ్రైవర్, 43 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో రాత పరీక్ష తేదీల వివరాలను వెల్లడించనుంది.








