నాకు వార్నింగ్ ఇచ్చేవాడు పుట్టలేదు : బండి సంజయ్
తెలంగాణలో 60 శాతం జనాభాకు భూమి లేదు, 25 లక్షల కుటుంబాలకు ఇంటి స్థలం కూడా లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కరీంనగర్ (Karimnagar)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కేసీఆర్ ( KCR) కుటుంబం అడ్డగోలుగా దోచుకున్నారని పాదయాత్ర సందర్భంగానే హెచ్చరించా. ఫామ్‌హౌస్ అక్రమాల గురించి మాట్లాడితే నా తల ఆరు ముక్కలుగా నరుకుతానని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ నాకు వార్నింగ్ ఇచ్చారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్‌ను మెడపట్టి ఫామ్‌హౌస్ (Farmhouse) నుంచి బయటకు గుంజుకొచ్చిందే బీజేపీ (BJP).నన్ను బెదిరించే వారు ఈ భూమ్మీద పట్టులేదు. తెలంగాణలో అధికారం మాకు రావాల్సింది. త్రుటిలో తప్పి అటు పోయింది. ఎవరు ఎవరి మెడలు వంచారో తెలంగాణ ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో వేల ఎకరాల భూమి కబ్జాకు గురైందని చెప్పడానికి ముఖ్యమంత్రికి వెయ్యి రోజులు పట్టిందా? ఇన్ని రోజులు డీల్ కుదరలేదా. బీఆర్ఎస్ నేతలతో సెటిల్మెంట్ కుదరనందుకు ఇప్పుడు బయటపెడుతున్నారా? అని ప్రశ్నించారు.








