సిట్ కస్టడీకి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా టెండర్ల కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao) ను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు ఆయన్ను విచారించి అరెస్ట్ చేసి హైదరాబాద్లోని చంచల్గూడ (Chanchalguda) జైలుకు తరలించారు. తాజాగా సిట్ అధికారులు ఆయన్ను కస్టడీకి తీసుకున్నారు. చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న అనంతరం పీటీ వారెంట్ (PT Warrant) పై విజయవాడకు తరలించారు. అక్కడి ఏసీబీ కోర్టు (ACB Court)లో కారుమూరిని హాజరుపరచనున్నారు.








