తిరుమల రాజకీయాలకు వేదిక కాకూడదు : సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
శ్రీవారి భక్తుడిగా పనిచేస్తూ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. తిరుమల (Tirumala)లో చంద్రబాబు మాట్లాడుతూ తాను 1999లో ప్రారంభించిన మ్యూజియం ఇవాళ ఆధునికీకరించినట్లు తెలిపారు. వేంకటేశ్వరస్వామి చరిత్ర అందరికీ అర్థమయ్యేలా మ్యూజియం (Museum) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకు అండగా నిలిచిన ట్రస్టుకు అభినందనలు తెలిపారు. రాబోయే ఐదేళ్లూ నిర్వహణ బాధ్యత ట్రస్టుకే అప్పగిస్తున్నాం. ప్రతి భక్తుడికి భద్రత ఇచ్చేందుకు ఎలఐసీ తరపున రూ.2 లక్షల బీమా అందిస్తున్నాం. ఆధార్ ఆధారిత పేపర్లెస్ క్లెయిమ్ తీసుకొచ్చాం. తిరుమలలో పవిత్ర భావం ఉండాలి. రాజకీయాలకు వేదిక కాకూడదు. తిరుమలలో పవిత్ర భావం ఉండాలి. రాజకీయాలకు వేదిక కాకూడదు. తిరుమలలో వేంకటేశ్వరస్వామి స్మరణ తప్ప మరొకటి వినపడకూడదు. ఇక్కడికి వచ్చే భక్తుడు ఏ విషయంలోనూ ఇబ్బంది పడకూడదు. ఇవాళ కొత్తగా 32 ఈవీ బస్సులు ప్రారంభించాం. రిలయన్స్ 25, భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ ఏడు బస్సులు ఇచ్చింది. సేవాభావంతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 12 లక్షల మంది శ్రీవారి సేవలకులుగా నమోదు చేసుకున్నారు. వీరిలో వైద్య, విద్యా సేవకులు వస్తున్నారు అని తెలిపారు.








