ఏపీ గవర్నర్ కు తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ (Justice S. Abdul Nazeer) ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా(Krishna District) పెనమలూరు మండలం పోరంకి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గవర్నర్ జస్టిస్ నజీర్, మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి సాగర తీరంలో ఏర్పాటు చేసిన మహాగణపతి( Mahaganapathi) ఉత్సవాలకు హాజరై 63 అడుగుల సప్తమృత్తిక విజయగణపతిని దర్శించుకున్నారు. సాయంత్రం మంగినపూడి నుంచి విజయవాడ (Vijayawada) వస్తుండగా పోరంకి సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా కాన్వాయ్‌కు అడ్డొచ్చాడు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో గవర్నర్ కాన్వాయ్‌కు ప్రమాదం తప్పింది.








