మోక్షు సినిమాలో బాలయ్య రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్
నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ(mokshagnya) సినీ ఎంట్రీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కేవలం కొత్త హీరో ఇంట్రో ఫిల్మ్ గా కాకుండా, కుటుంబ వారసత్వాన్ని కథలో కీలకంగా ముడిపెట్టేలా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బింబిసార(bimbisara)తో తన మార్క్ చూపించిన డైరెక్టర్ వశిష్ట(vassista) ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో కథపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దే పనిలో వశిష్ట ఉన్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో పునర్జన్మ కాన్సెప్ట్‌ను ప్రధాన కథాంశంగా తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. అదే సమయంలో బాలకృష్ణ(balakrishna) పాత్ర సినిమాకు కీలకమైన మలుపుగా నిలవనుందని తెలుస్తోంది. కేవలం గెస్ట్ రోల్ కు పరిమితం కాకుండా, దాదాపు 40 నిమిషాల పాటు స్క్రీన్‌పై కనిపించేలా పాత్రను డిజైన్ చేశారనే సమాచారం వినిపిస్తోంది. దీంతో మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో తండ్రి, కొడుకుల కాంబినేషన్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
ఇక కథకు అనుగుణంగా హీరోయిన్ సహా కీలక పాత్రల ఎంపిక జరగాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీలీల పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూటింగ్ మొదలయ్యేలోగా కాస్టింగ్, కథా నేపథ్యం తదితర అంశాలపై మేకర్స్ మరిన్ని వివరాలను అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.








