అవకాశాలున్నా, సక్సెస్ కు మాత్రం ఆమడ దూరంలో!
సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్ల కెరీర్‌ను పరిశీలిస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మంచి ప్రాజెక్టులు, క్రేజీ హీరోల సినిమాలు, గుర్తింపు ఉన్న డైరెక్టర్లతో పనిచేసే అవకాశాలొచ్చినా.. ఆ అవకాశాలు కెరీర్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లే సక్సెస్‌గా మారవు. ప్రస్తుతం మాళవికా మోహనన్(malavika mohanan) కెరీర్ కూడా ఇలాంటి దశలోనే కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. టాలెంట్‌తో పాటు గ్లామర్, పెర్ఫార్మెన్స్తో గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు అవకాశాల విషయంలో మాత్రం లోటు కనిపించడం లేదు.
అయితే మాళవిక కెరీర్లో ప్రధానంగా కనిపిస్తున్న సమస్య వరుస ఫెయిల్యూర్స్. ఒక్కో సినిమాలో కొత్తగా కనిపించే అవకాశం దక్కుతున్నా, ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలబడకపోవడంతో ఆ ఇంపాక్ట్ ఆమె మార్కెట్‌పై కూడా పడుతోంది. తాజాగా సర్దార్2(sardar2) కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోవడంతో.. మరోసారి మాళవిక కెరీర్లో ఇక బలమైన కమ్‌బ్యాక్ ఎప్పుడనే డిస్కషన్ మొదలైంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో భాగమైనా, ఆ ప్రాజెక్టుల సక్సెస్‌ను తన కెరీర్‌కు అనుకూలంగా మలుచుకోలేకపోవడం గమనార్హం.
అయితే ఇక్కడే మాళవికకు మరో బలమైన పాజిటివ్ పాయింట్ కనిపిస్తోంది. వరుస ఫ్లాపుల తర్వాత కూడా ఆమెకు అవకాశాలు రావడం చూస్తుంటే ఆమెపై మేకర్స్ కు ఇంకా నమ్మకం తగ్గలేదని అర్థమవుతుంది. ఒక మంచి కథ, స్ట్రాంగ్ క్యారెక్టర్, కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యే సినిమా కలిసొస్తే.. ఇప్పటివరకు వచ్చిన అవకాశాలన్నింటికీ మించి ఒకే హిట్ ఆమె కెరీర్‌ను మలుపుతిప్పే అవకాశం ఉంది. అందుకే మాళవిక తర్వాతి ప్రాజెక్ట్ ఆమె కెరీర్లో సాధారణ సినిమా కాకుండా కీలకమైన టర్నింగ్ పాయింట్‌గా మారుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది.








