ది ప్యారడైజ్ కు పాటే కొత్త బూస్ట్
నాని(nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్(the paradise) పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు సినిమాలోని పాటలే ఆ అంచనాలను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా యెషనాగుల కట్టమీద(yashanagula kattamidha) సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే.. ఇది కేవలం మ్యూజికల్ హిట్‌గా కాకుండా సినిమాకు కొత్త ఆడియన్స్‌ను తీసుకొచ్చే ప్రమోషనల్ టూల్ గా మారినట్టు కనిపిస్తోంది. అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) కంపోజ్ చేసిన ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్(kasarla shyam) సాహిత్యం, తెలంగాణ జానపద కళాకారుల వాయిస్ ప్రత్యేకమైన నేటివిటీని తీసుకొచ్చాయి.
రిలీజైన కొద్దిరోజుల్లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడం, 7.05 లక్షలకు పైగా లైక్స్ రావడం సాంగ్ క్రేజ్‌ను స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు.. యూట్యూబ్‌లో గ్లోబల్‌గా నంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలవడం మరో ఆసక్తికర అంశం. నాని, కీర్తి సురేష్(Keerthy suresh) పై షూట్ చేసిన సాంగ్ లోని కొన్ని విజువల్స్, వారి డాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమా గురించి చర్చించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇదే క్రమంలో ఆయా షేర్(aaya sher) తో వచ్చిన మ్యూజిక్ ఇంపాక్ట్‌ను యెషనాగుల కట్ట మీద పాట మరింత ముందుకు తీసుకెళ్లినట్టుగా కనిపిస్తోంది.
ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ది ప్యారడైజ్ కు మ్యూజిక్ ఇప్పుడు కేవలం ప్రమోషన్లో భాగం కాకుండా సినిమాకు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేస్తోంది. కథ, నాని లుక్, యాక్షన్‌తో పాటు తెలంగాణ నేటివిటీని మ్యూజిక్ ద్వారా ఆడియన్స్ లోకి తీసుకెళ్లడం సినిమాకు ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ గా మారుతోంది. మోహన్ బాబు(mohan babu), కాయదు లోహర్(kayadhu lohar), రాఘవ్ జుయల్(raghav juyal), సంపూర్ణేష్ బాబు(sampoornesh babu) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.








