వైవా హర్ష ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్ రిలీజ్
హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బాబు డెగాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చవాన్, శ్రీధర్ చెని, దీపక్ ముస్త్యాల నిర్మించారు. రాజ్ సుహాస్, ప్రమదేశ్వి వి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.
సెప్టెంబర్ 30 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ETV Winలో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. హర్ష ఫాదర్ ఎవరినైనా ప్రేమించమని చెప్పే సన్నివేశంతో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
టీజర్లో ఫన్ అలరించింది. హర్ష టైమింగ్ అదిరిపోయింది. హైపర్ ఆది పంచులు మరో హైలైట్‌గా నిలిచాయి.
జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి ఇతర కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు.
అజయ్ అరసాడ సంగీతం ఫన్ను మరింత ఎలివేట్ చేసింది. చిత్రానికి శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ అందించారు. జానీ షేక్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, లిఖిత్ లీ ఎడిటర్‌గా, సాయి ప్రావలిక కాస్ట్యూమ్ డిజైనర్‌గా, పీవీజీ విశ్వనాథ్ లైన్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.








