భీమవరంలో అలరించిన శోభా రాజు గారు వారి శిష్య గానం
శ్రీ విద్యా గణపతి 23వ వార్షిక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఉమా సోమేశ్వర గనుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య మరియు అన్నపూర్ణ మేమొరియల్ మ్యుజికల్ అకాడమీ ఆధ్వర్యంలో పద్మ శ్రీ పురస్కార గ్రహీత డా శోభారాజు గారి శిష్యులచే సంకీర్తనా గానం అమృత ధారలా సాగింది. తొలుత అన్నమ గాయిత్రి పఠించారు. తరువాత “కొండలలో నెలకొన్న”, “అదివో అల్లదివో”, “గోవిందా శ్రిత”, “తందానానా” వంటి బహుళ ప్రజాదరణ పొందిన అన్నమయ్య కీర్తనలు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి సాందీప్, తేజస్విని, శ్రేయా, అక్షయ్, సువర్ణ, అక్షయ గాత్రం చేయగా, కీబోర్డ్ రాజు, తబలా అజయ్ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమానంతరం పద్మ శ్రీ డా. శోభారాజు దంపతులును నిర్వాహకులు సత్కరించారు.








