సందీప్ కిషన్ సినిమాకు భారీ డిస్ట్రిబ్యూషన్
సందీప్ కిషన్(sundeep kishn) హీరోగా తెరకెక్కుతున్న సిగ్మా(sigma) పై రిలీజ్ కు ముందే బిజినెస్ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. జేసన్ సంజయ్(Jason sanjay) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హీస్ట్ థ్రిల్లర్‌కు ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ ను తీసుకొచ్చింది. ముఖ్యంగా సందీప్ కిషన్‌ను స్టైలిష్ యాక్షన్ హీరోగా ప్రజెంట్ చేసిన విధానం సినిమాపై అంచనాలను పెంచింది. భారీ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్(Lyca productions) నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా జేసన్ సంజయ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు.
ఈ క్రమంలో సిగ్మా థియేట్రికల్ బిజినెస్‌లోనూ మంచి అడుగులు వేస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణ రైట్స్ ను ప్రముఖ మైత్రీ(Mythri) డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకోగా, సీడెడ్ ఏరియా రిలీజ్ బాధ్యతలను ఎన్వీఆర్ సినిమా(NVR Cinema) తీసుకుంది. సాధారణంగా కంటెంట్‌పై నమ్మకం ఉంటేనే కీలక ప్రాంతాల్లో బలమైన డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ముందుకు వస్తాయి. సిగ్మా విషయంలోనూ ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా ఏర్పడిన క్రేజ్ ఈ డీల్స్‌కు ప్రధాన కారణంగా నిలిచినట్లు తెలుస్తోంది.
సందీప్ కిషన్ లుక్, యాక్షన్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు సినిమాలోని స్టైల్‌ను డైరెక్టర్ జేసన్ సంజయ్ ప్రమోషన్లలోనే స్పష్టంగా చూపిస్తున్నారు. మరోవైపు తమన్(thaman) అందిస్తున్న మ్యూజిక్, టీజర్-ట్రైలర్‌కు ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ఎక్స్ట్రా బజ్ ను తీసుకొచ్చాయి. దీంతో సిగ్మాపై థియేట్రికల్ ఎక్స్పెక్టేషన్స్ క్రమంగా పెరుగుతున్నాయి. అక్టోబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.








