ఫౌజీ రిలీజ్ పై కొత్త ప్లాన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) నటిస్తున్న ఫౌజీ(fauzi)పై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే సినిమా స్థాయికి తగ్గట్టుగా విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, ఇతర సాంకేతిక అంశాలపై విస్తృతంగా పని చేయాల్సి ఉండటంతో రిలీజ్ విషయంలో మార్పు తప్పదనే టాక్ వినిపిస్తోంది. దీంతో డిసెంబర్ రేసు నుంచి తప్పుకుని వచ్చే ఏడాది కొత్త డేట్ ను సెలెక్ట్ చేసే అవకాశాలు బలపడుతున్నాయి.
ప్రస్తుతం ఫౌజీకి ఫిబ్రవరి నెలను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ తన షూటింగ్ పార్ట్‌ను త్వరలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నప్పటికీ, కొన్ని కీలకమైన సీన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మిగిలి ఉన్నాయట. సినిమా కంటెంట్ విషయంలో ఎలాంటి తొందరపడకుండా ఫైనల్ అవుట్‌పుట్‌ను ఆడియన్స్ కు అందించాలనే ఉద్దేశంతోనే రిలీజ్ ప్లాన్‌ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అఫీషియల్ గా కొత్త డేట్‌ను అనౌన్స్ చేసేందుకు టీమ్ మరికొంత టైమ్ తీసుకుంటున్నట్లు సమాచారం.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇమాన్వి(Imanvi) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మరోవైపు సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్(netflix) దక్కించుకున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ పూర్తిగా ఫౌజీ షూటింగ్‌పైనే దృష్టి పెట్టడంతో, ఈ సినిమా పూర్తైన తర్వాతే ఆయన తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త రిలీజ్ డేట్‌పై త్వరలోనే మేకర్స్ నుంచి క్లారిటీ రానుంది.








