కోచింగ్ సెంటర్లపై సీఎం చంద్రబాబు సీరియస్ .. నిబంధనలు అతిక్రమిస్తే
కోచింగ్ కేంద్రాలు (Coaching centers) రాజకీయ కుట్రలకు వేదిక కాకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. కోచింగ్ సెంటర్ల అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నడిచే కోచింగ్ సెంటర్లపై చట్టపరంగా కొరడా ఝుళిపించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులను రాజకీయ ఆందోళనల(Political concerns) కు వినియోగిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోచింగ్ సంస్థలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. అభ్యర్థులు(candidates) రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా, పరీక్షలపైనే దృష్టి పెట్టాలని సూచించారు.








