అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం
బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma) కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో సీఎం సతీమణి గీత (Geeta), మంత్రులు కొండా సురేఖ (Konda Surekha), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas) తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. దీంతో బల్కంపేట వీధులు కిక్కిరిసిపోయాయి.








