21st July 2026

__________

- Saidulu

ఎలాంటి ఇండో-వెస్ట్రన్ డ్రెస్స్‌ పైనైనా అదిరిపోయే షోల్డర్ కేప్స్ కలెక్షన్ ...

ఫంక్షన్లలో దుపట్టా సర్దుకునే గోల లేకుండా రాయల్ లుక్ కావాలా? ట్రెండింగ్ షోల్డర్ కేప్స్‌తో మీ డ్రెస్సింగ్‌కి గ్రాండ్ టచ్ ఇవ్వండి!

వరుసల ముత్యాలతో రూపొందించిన ఈ కేప్స్, ప్లెయిన్ చీర లేదా గౌన్ పైకి ధరిస్తే రాయల్ నెక్లేస్ వేసుకున్నట్లే అత్యంత గ్రాండ్‌గా ఉంటుంది.

పెర్ల్ స్ట్రాండ్ కేప్

లేత రంగు నెట్ ఫ్యాబ్రిక్‌పై జరీ, సీక్విన్ వర్క్ ఉన్న కేప్స్ హెవీ బ్లౌజ్ అవసరం లేకుండానే చీరకు మోడ్రన్ ఇండో-వెస్ట్రన్ స్టైల్ ఇస్తాయి.

షీర్ నెట్ ఎంబ్రాయిడరీ కేప్

అంచులలో ఆర్చ్ ప్యాటర్న్ లేదా కట్ వర్క్ డిజైన్ ఉన్న కేప్స్, ఫ్యాన్సీ మరియు ఆర్గాంజా చీరలపై చాలా డిసెంట్, ట్రెండీగా కనిపిస్తాయి.

కట్ వర్క్ & స్కాలాప్ కేప్

కింద వేలాడే హ్యాంగింగ్స్, మోతీ ఫ్రింజెస్ ఉన్న కేప్స్ సంగీత్ మరియు కాక్టైల్ పార్టీల్లో డ్యాన్స్ చేసేటప్పుడు ఎంతో స్టైలిష్‌గా ఉంటాయి.

ఫ్రింజ్ & టాసెల్ కేప్ 

కాంతికి మెరిసే మిర్రర్ వర్క్ షోల్డర్ కేప్ వేసుకుంటే రాత్రి వేళ జరిగే ఈవెంట్లలో అందరి చూపు మీవైపే ఉండటం ఖాయం.

హెవీ మిర్రర్ వర్క్ కేప్

పగటిపూట జరిగే హల్దీ, మెహందీ వేడుకలకు తేలికపాటి ప్రింటెడ్ ఆర్గాంజా కేప్స్ ఎంతో రిఫ్రెషింగ్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.

ఫ్లోరల్ ఆర్గాంజా కేప్

శీతాకాలపు పెళ్లిళ్లకు, రిసెప్షన్లకు హెవీ జర్దోజీ వర్క్ ఉన్న వెల్వెట్ కేప్స్ రాయల్, మహారాణి వైబ్‌ని అందిస్తాయి.

వెల్వెట్ ఎంబెలిష్డ్ కేప్

హెవీ షోల్డర్ కేప్ ధరించినప్పుడు మెడలో నెక్లేస్ నివారించండి! కేవలం స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ పెడితే లుక్ పూర్తవుతుంది.

జ్యువెలరీ & స్టైలింగ్ టిప్