ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణికి టీటీఏ బృందం ఘన సన్మానం..
టీటీఏ మెగా కన్వెన్షన్లో ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఘన సన్మానం జరిగింది. టీటీఏ బృందం కీరవాణిని వేదికపై సత్కరించారు. అమెరికాలోని వేలాది మంది తెలుగువారి సమక్షంలో జరిగిన ఈ సన్మానం, కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నవీన్ రెడ్డి మలిపెద్ది సారథ్యంలో టీటీఏ ఎంతో అద్భుతంగా నిర్వహించిందని ప్రశంసించారు. సమయం చాలా అవుతున్నప్పటికీ, ఓపికగా సంగీత విభావరి కోసం వేచి చూసిన ప్రేక్షకులను ఉద్దేశించి, మీ అందరినీ ఆనందపరిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఈ సన్మానం తనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.








