రాకా సెట్ నుంచి షాకింగ్ లీక్.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో
అల్లు అర్జున్(Allu Arjun), అట్లీ(Atlee) కాంబినేషన్లో రూపొందుతున్న రాకా(Raaka) ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. బియాండ్ ది యూనివర్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలైనప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముంబైలో కొనసాగుతున్న దీర్ఘకాలిక షూటింగ్‌ను చిత్రబృందం అత్యంత గోప్యంగా నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటివరకు సినిమా నుంచి ఎలాంటి కీలక లీక్ బయటకు రాకపోవడంతో అభిమానుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు వీడియోలు ఈ ప్రాజెక్టుపై మరోసారి చర్చకు దారి తీశాయి.
సినిమాలో నటిస్తున్న ఆర్టిస్ట్ అన్వేష(Anvesha) తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్న వీడియోల్లో షూటింగ్‌కు ముందు జరిగిన మేకప్ ప్రక్రియ కనిపించింది. ఆమె ముఖమంతా గులాబీ రంగు ప్రోస్థెటిక్ మేకప్‌తో పూర్తిగా కప్పబడి ఉండగా, స్పెషల్ ఫేషియల్ మార్కింగ్స్‌తో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లుక్‌ను డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ రూపం హాలీవుడ్ మూవీ అవతార్(Avatar) లోని నావీ పాత్రలను గుర్తు చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో రాకా సినిమాలో కనిపించబోయే ఫాంటసీ ప్రపంచం, విజువల్ డిజైన్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ వీడియోలు అనుకోకుండా సినిమా విజువల్ కాన్సెప్ట్‌కు సంబంధించిన తొలి సంకేతాలుగా మారాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఊహించని లీక్‌పై మేకర్స్ ఎలా స్పందిస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రపంచ స్థాయి విజువల్స్, భారీ వరల్డ్ బిల్డింగ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తుండగా, సిరి హనుమంతు(Siri Hanumanthu) కీలక పాత్రలో కనిపించనుంది. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్(Sai Abhyankar) మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ తాజా వీడియోలతో రాకాపై సోషల్ మీడియాలో డిస్కషన్ మరింత ఊపందుకోగా, అఫీషియల్ గా మేకర్స్ రిలీజ్ చేసే ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








