ఆక్వా రంగాన్ని ఆదుకోండి : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా, రైతు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) కోరారు. ఈ మేరకు ముగ్గురు కేంద్రమంత్రులకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్‌ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ (Rajiv Ranjan Singh)ను సీఎం కోరారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ఏపీ నుంచి ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయాల్ (Piyush Goyal) కు విజ్ఞప్తి చేశారు. ఆక్వా రంగంలో జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)ను చంద్రబాబు కోరారు.








