తమ్మినేని భూ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యప్రసాద్
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సామాన్యుల ఇబ్బందులు తొలగించేవే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (ఆర్ఎస్కే)ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Angani Satya Prasad) వివరించారు. ఇవి ప్రజలకు మేలు చేసేవే తప్ప ఓ ఒక్కరినీ నష్టం చేయవని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లను పిలిపించే మాట్లాడితే వారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారన్నారు. కొన్ని రాజకీయ పార్టీల (political parties) స్వార్థం కోసం వేసే ట్రాప్లో పడొద్దని కోరారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా ఆర్ఎస్కేలు ఒక నూతన సాంకేతిక విధానమని తెలిపారు. గొడ్డలి పార్టీ రాజకీయ స్వలాభం కోసమే అసత్య ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. తమ్మినేని (Tammineni) భూ అక్రమాలతో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు (Ashok Gajapathiraju) భూమిపై చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపైనా చర్యలు ఉంటాయన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన అన్ని అక్రమాలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.








