ఈ నేరాలపై వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడారు? : కూనం రవికుమార్
స్పీకర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో నీతులు చెప్పిన తమ్మినేని సీతారామ్ (Tammineni Sitaram) బతికున్న మనిషి చనిపోయినట్టు నకిలీ సర్టిఫికేట్ సృష్టించి భూములు కొట్టేశారని ఎమ్మెల్యే కూన రవికుమార్ (Koona Ravikumar) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.4కోట్ల విలువైన స్థలం అక్రమ కొనుగోలు వెనుక సూత్రాధారి సీతారామ్, పాత్రధారి ఆయన కుమారుడని ఆక్షేపించారు. భూములు కావాలంటే చట్టబద్ధంగా కొనుగోలు చేయాలి కానీ, బతికుండగానే చనిపోయాడని ఫేక్ సర్టిఫికెట్ సృష్టిస్తారా? అని ప్రశ్నించారు. కుమారుడు చేసిన ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోతే ఆ కేసులో మరొకరిని ఇరికించేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ నేరాలపై వైసీపీ నాయకులు ( YCP leaders) ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.








