సాంప్రదాయ లుక్ లో అదరగొడుతున్న నభా
నన్ను దోచుకుందువటే(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయైన నభా నటేష్(Nabha Natesh) తర్వాత ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) మూవీతో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మధ్యలో ఓ యాక్సిడెంట్ కారణంగా సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న నభా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్న ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే నభా తాజాగా సాంప్రదాయ లుక్ లో కనిపించింది. ఈ లుక్ లో నభా మెరూన్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న సిల్క్ శారీ, దానికి మంచి ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, శారీకి తగ్గ జ్యువెలరీ ధరించి తన అందాలను మరింత ఎలివేట్ అయ్యేలా పోజులిచ్చింది. ఈ ఫోటోలు చూసి నభా మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు, సాంప్రదాయ లుక్ లో కూడా ఎంతో అందంగా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.








