దశాబ్దాల మొండి సమస్యకు మంత్రి లోకేష్ శాశ్వత పరిష్కారం
మంగళగిరి నియోజకవర్గంలో రెండో విడతలో సుమారు 3 వేల మందికి పట్టాలు సిద్ధం
21,22 తేదీల్లో ‘మన ఇల్లు – మన లోకేష్’ కార్యక్రమం ద్వారా పంపిణీకి ఏర్పాట్లు
మంగళగిరి: ఎన్నికల సమయంలో ఓట్లకోసం అలవికాని వాగ్దానాలు చేసి, అవసరం తీరాక మొఖం చాటేసే సాంప్రదాయ రాజకీయ నాయకులకు భిన్నంగా… మంగళగిరి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునేందుకు మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు. దశాబ్దాలుగా మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న సుమారు 3వేల మందికి ఈనెల 21,22 తేదీల్లో మన ఇల్లు – మన లోకేష్ పేరిట రెండో విడత శాశ్వత పట్టాలు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మంగళగిరి డీజీపీ ఆఫీసు సమీపంలోని సీకే కన్వెన్షన్ హాలులో రెండో విడత పట్టాలు పంపిణీ చేయనున్నారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కొండవాలు ప్రాంతాలు, అటవీ, దేవాలయ భూముల్లో వేలాది మంది ప్రజలు ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటూ వస్తున్నారు. అయితే వారికి సంబంధిత భూములపై ఎటువంటి అధికారిక హక్కులు ఇప్పటివరకు లేవు. దీంతో సంబంధిత స్థలాలను తమ వారసులకు ఇవ్వాలన్నా, అత్యవసర సమయాల్లో రుణాలు తీసుకోవాలన్నా సాధ్యంకాని పరిస్థితులు నెలకొన్నాయి. మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న ఈ జఠిలమైన సమస్యను ఎన్నికలకు ముందు ప్రత్యక్షంగా చూసిన యువనేత లోకేష్… తాము అధికారంలోకి వస్తే ఈ మొండి సమస్యకు పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2025 ఏప్రిల్ నెలలో మంగళగిరి రత్నాల చెరువు, యర్రబాలెం, నీరుకొండ తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న 3002మందికి నూతన వస్త్రాలు పెట్టి మరీ పట్టాలు పంపిణీ చేశారు. సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూములను ఒక్కరూపాయి ఖర్చులేకుండా అర్హులైన పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ పట్టాలు అందజేశారు.
ఇవి కూడా చదవండి
మలివిడత అందించే శాశ్వత పట్టాల వివరాలు
మలివిడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో సుమారు 3వేల మందికి శాశ్వత పట్టాలు, ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్స్ ను మంత్రి లోకేష్ చేతులమీదుగా పంపిణీ చేయనున్నారు. రెండోవిడతలో పంపిణీ చేయబోతున్న పట్టాల విలువ ప్రస్తుత ఓపెన్ మార్కెట్ ప్రకారం సుమారు వెయ్యి కోట్లుగా ఉంది. మంగళగిరి గ్రామంలోని సర్వే నంబర్లు 232/1B1A, 232/1B1B, 232/1B1Cలలో 92.12 ఎకరాలు, నవులూరు గ్రామంలోని సర్వే నంబర్ 115లో 8.46 ఎకరాల భూములు సెక్షన్ 22A(1)(a) కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నాయి. దీనివల్ల 1,622 నివాస గృహాలు ప్రభావితమై, దీర్ఘకాలంగా ఆస్తి రిజిస్ట్రేషన్‌పై ఆంక్షలు విధించబడ్డాయి. ఫలితంగా బదిలీ, వారసత్వం, సంక్రమణ వంటి చట్టబద్ధమైన లావాదేవీలకు ఇప్పటివరకు అవకాశం లేకుండా పోయింది. ఈ స్థలాలపై నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డీవో ద్వారా ధృవీకరించిన ప్రాపర్టీ ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్లను మంత్రి లోకేష్ అందజేయనున్నారు.
స్టీల్ బ్రిడ్జ్ పట్టాలు
అమరావతి రాజధాని నగర ప్రాజెక్టులో భాగంగా బకింగ్‌హామ్ కాలువపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి, మంగళగిరిలోని కె.ఎల్. రావు కాలనీలో ఆక్రమణదారులుగా ఉన్న మొత్తం 81 మందిని గుర్తించారు. ప్రభావితమైన ఈ ఆక్రమణదారులకు పునరావాసం కల్పించేందుకు, ఆత్మకూరు లేఅవుట్లో 34 ప్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు. పంపిణీకి ప్రతిపాదించిన మొత్తం 81 స్టీల్ బ్రిడ్జ్ పట్టాలలో తాడేపల్లి మండలంలో 47, మంగళగిరి మండలంలో 34 కేసులు ఉన్నాయి.
G.O.Ms.No.30 క్రమబద్ధీకరణ పట్టాలు
G.O.Ms.No.30 నిబంధనల ప్రకారం, మొత్తం 906 క్రమబద్ధీకరణ పట్టాలను (150 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం కలిగినవి) పంపిణీ చేయడానికి ప్రతిపాదించారు. వీటిలో 630 పట్టాలు తాడేపల్లి మండలానికి చెందినవి కాగా, 276 పట్టాలు మంగళగిరి మండలానికి సంబంధించినవి.
***
[6:42 pm, 20/7/2026] +91 98499 59466: Press release
గ్రామీణ ప్రతిభావంతులకు వదాన్య ఫౌండేషన్ చేయూత
ఈ ఏడాది జాతీయ సంస్థల్లో ముగ్గురు విద్యార్థులకు సీట్లు
ఫౌండేషన్ నిర్వాహకులకు మంత్రి లోకేష్ అభినందనలు
అమరావతి: వదాన్య ఫౌండేషన్ నిర్వాహకులు తమ ఆదాయం నుంచి కొంతభాగాన్ని పేదపిల్లల విద్యాభ్యాసం కోసం ఖర్చుచేసి, జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడంపై రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందిన అశోక్ పడపాటి వృత్తిరీత్యా హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగల పేద విద్యార్థులకు చేయూతనందించాలన్న సంకల్పంతో 2010లో అశోక్, అతని స్నేహితులు తమ జీతాల నుంచి కొంతభాగాన్ని పక్కనబెట్టి… వదాన్య ఫౌండేషన్ ను స్థాపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహించి, ప్రతిభగల విద్యార్థులను ఎంపికచేసి వారికి ఐఐటి, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీపరీక్షల్లో శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది వదాన్య ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన జుగేష్ కుమార్ ఐఐటీ మద్రాస్‌లో, తులసి కార్తీక్ భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్సీ) బెంగళూరులో, యశ్వంత్ కుమార్ రెడ్డి ఐఐటీ రూర్కీలో ప్రవేశాలు పొందారు. వీరంతా పదో తరగతి వరకు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చినవారే. వదాన్య ఫౌండేషన్ అందించిన నిరంతర మార్గదర్శకత్వం, విద్యా సహాయం, జేఈఈ అడ్వాన్స్డ్ శిక్షణతో వారు ఈ ఘనతను సాధించారు.
వదాన్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అశోక్ పడపాటి, ఈ ఏడాది జాతీయస్థాయి సంస్థల్లో ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులు సోమవారం ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను చిన్న వయస్సులోనే గుర్తించి ప్రోత్సహిస్తున్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అశోక్ పడపాటిని మంత్రి అభినందించారు. 9,10వ తరగతి విద్యార్థుల కోసం 500కు పైగా ప్రాక్టీస్ ప్రశ్నలతో రూపొందించిన వదాన్య టాలెంట్ టెస్ట్ ప్రశ్నల పుస్తకాన్ని అశోక్… మంత్రికి అందజేశారు. ఫౌండేషన్ కృషిని మంత్రి లోకేష్ ప్రశంసిస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోటీపరీక్షలకు అవసరమైన కొశ్చన్ బ్యాంక్ రూపకల్పనకు వదాన్య సహకారం తీసుకుంటామని అన్నారు. అలానే ఇటువంటి టాలెంట్ టెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి, ప్రతిభావంతులను ప్రోత్సహించే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.








