పండుగలైనా, స్పెషల్ లంచ్ బాక్స్ అయినా.. తాజా కొబ్బరి కమ్మని సువాసనతో గుర్తుచోచే వంటకం కొబ్బరి అన్నం. దీని రుచి అందరికీ ఎంతో ఇష్టం!
1 కప్పు ఉడికించిన అన్నం, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి లేదా కొబ్బరి నూనె, ఆవాలు, మినపప్పు, శెనగపప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు.
కావలసిన పదార్థాలు
బియ్యం వండిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి చల్లార్చాలి. అన్నం మెతుకులు అతుక్కోకుండా పొడిపొడిగా ఉంటేనే కొబ్బరి అన్నం రుచిగా ఉంటుంది.
అన్నం సిద్ధం చేయడం
బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, శెనగపప్పు, దోరగా వేయించిన జీడిపప్పు వేసి కరకరలాడే వరకు తాలింపు బాగా వేయించుకోవాలి.
పోపు సిద్ధం చేయడం
తాలింపులో పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి మంచి సువాసన వచ్చే వరకు వేపాలి.
సువాసనలు జోడించడం
ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి సన్నని మంటపై కేవలం 1-2 నిమిషాలు వేపాలి. కొబ్బరి రంగు మారకుండా తేమ పోయేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
కొబ్బరి తురుము వేయించడం
వేయించిన కొబ్బరి మిశ్రమంలో చల్లార్చిన అన్నం, రుచికి సరిపడా ఉప్పు వేసి, అన్నం విరిగిపోకుండా నిదానంగా బాగా కలియబెట్టుకోవాలి.
అన్నం మిక్స్ చేయడం
ఈ కొబ్బరి అన్నాన్ని కొబ్బరి పచ్చడి, ఆలుగడ్డ కుర్మా, నూనె వంకాయ కూర లేదా సింపుల్గా అప్పడాలతో నంజుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
కాంబినేషన్స్