సోషల్ మీడియా ప్రచారంపై మల్లారెడ్డి ఫైర్.. బీఆర్ఎస్లోనే ఉంటానని స్పష్టం
పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) స్పందించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీ (political party)లోనూ చేరబోనని, బీఆర్ఎస్ (BRS)లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల తన పార్టీ మార్పుపై సోషల్ మీడియా (social media), రాజకీయ వర్గాల్లో వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. బీఆర్ఎస్ నాయకత్వంపై తనకు పూర్తిగా విశ్వాసం ఉందన్నారు. పార్టీ బలోపేతం కోసం గతంలో ఎలా పనిచేశానో, ఇకముందు కూడా అదే విధంగా పనిచేస్తానని తెలిపారు.








