మద్యం కుంభకోణం కేసు.. వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి (Vasudeva Reddy)కి సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టు (ACB Court)కు సిట్ సమర్పించిన రిమాండ్ రిపార్టులో కీలక అంశాలను ప్రస్తావించింది. జిల్లా స్థాయిలో వికేంద్రీకృత విధానాన్ని రద్దు చేసి, ఆ స్థానంలో రాష్ట్రస్థాయి విధానాన్ని తీసుకొచ్చారని పేర్కొంది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ రిపోర్టులో వివరించింది. ప్రభుత్వ అనుమతులు రాకుండానే టెండర్ పత్రాలు సిద్ధం చేశారని తెలిపింది. కార్టన్ రవాణా ఖర్చు రూ.19.68కి బదులు రూ.32.53కి పెంచారని చెప్పింది. సిగ్మా ( Sigma), ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ (Prasad Transport) కంపెనీలకు లబ్ధి కలిగేలా, టెండర్ నిబంధనలు రూపొందించారని స్పష్టం చేసింది. షెల్ కంపెనీలు, పెట్రోల్ బంకులు (petrol bunks), బినామీల ద్వారా నగదు మళ్లించారని పేర్కొంది.








