బాలయ్య మూవీలో ఐశ్వర్య రాజేష్ నెగిటివ్ రోల్
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్లో రూపొందనున్న కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన వివరాలు సినీ వర్గాల్లో డిస్కషన్ కు వస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్స్‌ను సమతూకంగా మిళితం చేసే కథతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోందని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెను మామూలు హీరోయిన్గా కాకుండా, కథకు మలుపు తిప్పే నెగిటివ్ షేడ్స్ ఉన్న బలమైన పాత్రలో చూపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర కథలో కీలక ప్రభావం చూపేలా డిజైన్ చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఇక బాలకృష్ణ క్యారెక్టర్ విషయంలో కూడా కొరటాల శివ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనుందట. ఆ భాగంలో బాలయ్య పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించడమే కాకుండా, మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో కూడిన పవర్ఫుల్ క్యారెక్టర్లో దర్శనమిస్తారని సమాచారం. ఈ ఎపిసోడ్లో ఆయన మాస్ ఇమేజ్‌కు తగ్గ యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
దేవర(Devara) తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో కథ, పాత్రల రూపకల్పనపై ఆయన విస్తృతంగా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను బలంగా మిళితం చేసిన కథను రెడీ చేశారని సమాచారం. సుధాకర్ చెరుకూరి(Sudhakar cheurukuni), సుధాకర్ మిక్కిలినేని(Sudhakar Mikkilineni) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ఈ విశేషాలు అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా బాలయ్యను మరోసారి పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూడాలనే ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.








