అమెరికా పౌరులే లక్ష్యం … వికాస్ కుమార్ అరెస్ట్ చేసిన ఈడీ
అమెరికా పౌరులే (American citizens) లక్ష్యంగా మోసాలకు పాల్పడిన వ్యక్తిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా వికాస్ కుమార్ (Vikas Kuma) నకిలీ కాల్ సెంటర్ (Call Center) ఏర్పాటు చేసి దాని ద్వారా, అమెరికన్లకు ఫోన్ చేసి మోసాలకు పాల్పడినట్లు సమాచారం. మాదాపూర్‌లో 2023లో నమోదైన ఈ కేసుకు సంబంధించిన లావాదేవీలు, విదేశీ నిధుల బదిలీలపై ఈడీ విచారణ చేపట్టింది. అమెరికాలో పలువురిని బెదిరించిన వికాస్ ముఠా రూ.కోట్లలో వసూలు చేసి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ (ED) గుర్తించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు వికాస్‌ను అరెస్టు చేశారు.








