శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు టీమిండియా ఇదే..!
శ్రీలంకతో త్వరలో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం టీమిండియా జట్టును అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు నెలలో శ్రీలంక వేదికగా జరగనున్న ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టుకు శుభ్‌మన్ గిల్(Shubhman Gill) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్‌గా కె.ఎల్. రాహుల్(KL Rahul) బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఈ జట్టు ఎంపికలో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్లో టెన్నిస్ ఎల్బో గాయానికి గురైన రవీంద్ర జడేజా(Ravindra jadeja), అప్పటినుంచి జట్టుకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఫిట్నెస్ సాధించడంతో లంక పిచ్‌లపై భారత స్పిన్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు సెలక్టర్లు జడేజాను జట్టులోకి తిరిగి తీసుకున్నారు. కాగా, ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన మరో కీలక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ ఎంపికకు అందుబాటులో లేకపోవడం జట్టుకు కొంత ప్రతికూలాంశంగా మారింది.
వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని భర్తీ చేస్తూ మధ్యప్రదేశ్ రంజీ జట్టు ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌కు సెలక్టర్లు అనూహ్యంగా తొలిసారి భారత జట్టులో అవకాశం కల్పించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 131 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ 25.98 సగటుతో రాణిస్తూ ఇండియా-ఏ తరఫున లంక-ఏ పై అద్భుత ప్రదర్శన చేసిన సారాంశ్, భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి ఈ మేజర్ కాల్-అప్ అందుకున్నారు. అయితే, స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌ల లభ్యత మాత్రం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇచ్చే ఫిట్నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. భారత జట్టు ఆగస్టు 7 నుండి కొలంబో వేదికగా నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటంతో లంక పర్యటనను ప్రారంభించనుంది. ఆ తర్వాత ఆగస్టు 15 నుండి 19 వరకు గాలేలో మొదటి టెస్ట్ మ్యాచ్, ఆగస్టు 23 నుండి 27 వరకు కొలంబోలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనున్నాయి.
భారత పూర్తి టెస్ట్ జట్టు ఇదే:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.








