కేంద్ర మంత్రులతో మంత్రి గడ్డం వివేక్ భేటీ
తెలంగాణ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ (Gaddam Vivek) ఢిల్లీ పర్యటించారు. పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రి వెల్లండిచారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamsi Krishna)తో కలిసి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా.మన్సుఖ్ మాండవీయ (Dr. Mansukh Mandaviya), కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి (Jayant Chaudhary), కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)ని కలిసినట్లు తెలిపారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, రాష్ట్రానికి అవసరమైన సహకారం అందించాలని కోరానన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, యువతకు నైపుణ్యాభివృద్ధి, గనుల రంగం పురోగతి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తాం. ప్రజలకు మరింత మెరుగైన అవకాశాలు, అభివృద్ధి ఫలాలు అందేలా నిరంతరం కృసి చేస్తాం అని తెలిపారు.








