డల్లాస్‌లో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ
డల్లాస్‌లో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంస్క రణల గురించి వివరించారు. పార్టీ చేపడుతున్న డిజిటల్ కార్యక్రమాలను వారికి పరిచయం చేశారు. జగన్ 2.0 సూపర్ యాప్‌ను ఆవిష్కరించారు.
ఎన్నారై వైకాపా డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో వైకాపా ఎన్నారై వ్యవహారాల సమన్వయకర్త ఆలూరు సాంబశివారెడ్డితో స్థానిక ప్రవాసుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సూపర్ యాప్‌ను ఆవిష్కరించి యాప్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టర్‌పై అభిమానులు, పార్టీ శ్రేణులు సంతకాలు చేసి తమ సంఘీభావాన్ని తెలిపారు. సాంకేతికత సహాయంతో ప్రజలతో, పార్టీ శ్రేణులతో దగ్గరగా ఉండేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని సాంబశివారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో డా. కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, అన్నప్పురెడ్డి శివ, తిరుమల్ రెడ్డి, కృష్ణా రెడ్డి కోడూరు, దర్గా నాగిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.








