ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ (Ramalayam Construction)నిర్మాణానికి సుప్రీంకోర్టు (Supreme Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణానికి కలెక్టర్ (Collector) ఇచ్చిన ఎన్వోసీని కోర్టు సమర్థించింది. ప్రభుత్వ స్థలంలో రామాలయాన్ని నిర్మించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ (Petition)ను కొట్టివేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే, మరో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.







