ప్రజల రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం పేరు తెచ్చుకున్నారు : చంద్రబాబు
దేశానికి శాస్త్ర, సాంకేతికపరమైన ఎన్నో విజయాలను అందించి, మిస్సైల్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam) వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నివాళులు అర్పించారు. తన నిరాడంబరత, నిజాయతీ, మానవతా దృక్పథం వంటి విశిష్ట లక్షణాలతో ప్రజల రాష్ట్రపతి (President)గా కలాం పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆ మహనీయుని వర్ధంతి (Death Anniversary) సందర్భంగా సీఎం నివాళులర్పించారు.







