థింసా నృత్యంతో ప్రధాని మోదీకి ఘనస్వాగతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆగస్టు 1న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లపై మంత్రులు వగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధార్మాణి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి విజయనగరంతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం జల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. విజయనగరంలో నియోజకవర్గాల నుంచి ఎక్కువ మందిని సమీకరించాలని సూచించారు. పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు ప్రైవేటు పార్కింగ్ స్థలాలను ఎంపిక చేయాలని మంత్రులు ఆదేశించారు. విమానాశ్రయంలో 13 వేల మంది బాలికలతో అరకు థింసా గిరిజన నృత్యం (Thimsa tribal dance)తో ప్రధాని మోదీకి ఘనస్వాగం పలకాలని నిర్ణయించారు. అల్లూరు సీతారామరాజు (Alluri Sitarama Raju) జిల్లా నుంచి 6 వేలు, పార్వతీపురం మన్యం నుంచి 5 వేలు, పోలవరం జిల్లా నుంచి 2 వేల మంది బాలికలకు థింసా నృత్యంలో పాల్గొంటారని వివరించారు.








