24th July 2026

_________

- Saidulu

పుస్తక పఠనం పై ఆసక్తిని పెంచే వాల్ లైబ్రరీ డెకర్ ఐడియాస్!

గోడలపై ప్రముఖుల కొటేషన్లు రాస్తే విద్యార్థులలో పుస్తక పఠనంపై ఆసక్తి, సానుకూల దృక్పథం పెరుగుతాయి.

స్ఫూర్తిదాయక కొటేషన్లు

గోడపై అందమైన చెట్టును పెయింట్ చేసి, దాని కొమ్మలపై పుస్తకాలు అమర్చినట్లుగా వినూత్నంగా చిత్రించాలి.

పుస్తకాల చెట్టు డిజైన్

లైబ్రరీ గోడలకు లేత నీలం, ఆకుపచ్చ లేదా తెలుపు రంగులు వేయడం ద్వారా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది.

వర్ణాల ఎంపిక

గోడలకు ఇంద్రధనస్సు రంగులలో బుక్ షెల్ఫ్స్ అమర్చి పుస్తకాలను రంగుల వారీగా సర్దితే చూడటానికి భలే ఉంటుంది.

ఇంద్రధనస్సు బుక్ షెల్ఫ్

ఒక గోడను ప్రత్యేకంగా అందమైన వాల్‌పేపర్‌తో అలంకరించి, అక్కడ కూర్చుని చదువుకునేలా ఏర్పాటు చేయాలి.

రీడింగ్ కార్నర్ డిజైన్

సైన్స్, చరిత్ర, కళలకు సంబంధించిన చిత్రాలను గోడలపై ప్రదర్శించడం ద్వారా విజ్ఞానం మరింత పెరుగుతుంది.

సైన్స్ & ఆర్ట్ వాల్

గోడల పక్కన ఆకర్షణీయమైన స్టైలిష్ లైట్లు లేదా ఫెయిరీ లైట్లు అమర్చితే లైబ్రరీకి సరికొత్త లుక్ వస్తుంది.

హ్యాంగింగ్ లైటింగ్స్

ప్రకృతి దృశ్యాలు లేదా చెట్ల వాల్‌పేపర్లను అంటించడం వల్ల మనసుకు ప్రశాంతత లభించి ప్రశాంతంగా చదువుకోవచ్చు.

నేచర్ థీమ్ వాల్‌పేపర్స్

విద్యార్థులు గీసిన చిత్రాలు లేదా కథల పోస్టర్లను గోడలపై ప్రదర్శించి వారిని ప్రోత్సహించవచ్చు.

విద్యార్థుల ఆర్ట్ గ్యాలరీ

లైబ్రరీ నియమాలను గుర్తు చేసేలా సైలెంట్ జోన్, 'పుస్తకాలు మన నేస్తాలు' వంటి బోర్డులను అమర్చాలి.

నిశ్శబ్ద సందేశాలు