నగరవెలుగుల్లో మెరిసిపోతున్న మీనాక్షి
ఇచ్చట వాహనములు నిలుపరాదు(Ichta vahanamulu niliparadhu) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని మంచి నటిగా పేరందుకుంది. వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తున్న ఆమె తాజాగా చికాగో వెకేషన్ కు వెళ్లి అక్కడ్నుంచి కొన్ని ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో అమ్మడు వైట్ టీ షర్ట్, బ్లూ కలర్ బాటమ్ ధరించి, మెడలో సింపుల్ చైన్ ఒకటి వేసుకుని ఎంతో సింపుల్ గా, చాలా క్లాసీ గా కనిపిస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ ఫోటోలు చూసి నగర వెలుగుల్లో మీనాక్షి ఫేస్ వెలిగిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.








