కమల్ లైనప్ మారిందా?
కమల్ హాసన్(Kamal hassan) తన రాబోయే సినిమాల ప్లానింగ్ లో కీలక మార్పులు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటివరకు యాక్షన్ కొరియోగ్రాఫర్- డైరెక్టర్ల ద్వయం అన్బరివ్(Anbariv)తో ఆయన తదుపరి సినిమా ప్రారంభమవుతుందని భావించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్ట్ కొంతకాలం వాయిదా పడినట్లు తెలుస్తోంది. దాని ప్లేస్ లో డైరెక్టర్ ఎస్.యూ. అరుణ్ కుమార్(S. U Arun Kumar) తెరకెక్కించే సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్ వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మార్పుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా వెలువడలేదు.
ఎస్.యూ. అరుణ్ కుమార్ తన కెరీర్లో కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కథలో భావోద్వేగం, సహజత్వం, బలమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే డైరెక్టర్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. అలాంటి డైరెక్టర్ తో కమల్ హాసన్ జతకట్టడం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కమల్ ఇమేజ్‌కు తగ్గట్టే విభిన్నమైన కథను ఈ ప్రాజెక్ట్ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో ఈ కాంబినేషన్ నుంచి మరో ప్రత్యేకమైన సినిమా రానుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే కమల్ హాసన్ చేతిలో ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కల్కి పార్ట్2(Kalki2)లో ఆయన కీలక పాత్రలో కొనసాగుతుండగా, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dileep Kumar)తో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్బరివ్‌తో చేయాల్సిన సినిమా పూర్తిగా రద్దు కాలేదని, అరుణ్ కుమార్(Arun Kumar) చిత్రం పూర్తైన తర్వాత ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశం ఉందని సమాచారం. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కమల్, తన భవిష్యత్ లైనప్‌ను వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.








