తిరుపతి విమాన ఛార్జీలను తగ్గించండి… కింజరపు రామ్మోహన్ నాయుడుకు భాను ప్రకాశ్ రెడ్డి వినతి
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఢిల్లీలోని వారి కార్యాలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుమలకు ఉదయం సమయాల్లో నడిచే విమానాల చార్జీలు అధికంగా ఉన్నందున, వాటిని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరగా, కేంద్రమంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు సానుకూలంగా స్పందించారు.








