రామాయణ ట్రైలర్‌కు కొత్త డేట్ ఫిక్స్..
భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణ(ramayana) సినిమా ట్రైలర్ రిలీజై పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ అయిన ట్రైలర్ ను ముందుగా జూలై 28న సెలెక్ట్ చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో ప్రదర్శించాలని, తర్వాత జూలై 30న ఇండియాలో అఫీషియల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ చేసినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మొదట జూలై 24న ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రిలీజ్‌తో పాటు ఢిల్లీలోని భారత్ మండపంలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ, ఆఖరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు.
ట్రైలర్ వాయిదాకు నిర్మాత నమిత్ మల్హోత్రా(namith malhotra) వెల్లడించిన కారణం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ హాలీవుడ్ సంస్థ సోనీ పిక్చర్స్(Sony pictures) ఎంటర్టైన్మెంట్తో కుదిరిన గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ డీల్ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్లాన్ ను కొత్తగా రూపొందించాల్సి వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ డీల్ ప్రకారం భారతదేశం మినహా ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ బాధ్యతలను సోనీ పిక్చర్స్(Sony pictures) నిర్వహించనుండటం విశేషం. దీంతో రామాయణకు విదేశీ మార్కెట్లో మరింత భారీ స్థాయిలో విడుదల అవకాశాలు ఏర్పడనున్నాయి.
అయితే ఇప్పటికే అనౌన్స్ చేసిన ట్రైలర్ డేట్ ను ఆఖరి నిమిషంలో మార్చడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం కారణంగా ట్రైలర్‌ను వాయిదా వేయాల్సిన అవసరం ఏమిటని కొందరు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రభావవంతమైన ప్రమోషన్స్ కోసం మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నితేష్ తివారీ(Nitesh tiwari) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మైథలాజికల్ విజువల్ స్పెక్టకల్లో రణబీర్ కపూర్(ranbir kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai pallavi) సీతగా, యష్(Yash) రావణుడిగా కనిపించనుండగా, తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.








